మోకాళ్ళు, కీళ్ల నొప్పులు తగ్గడానికి చిట్కాలు...! 1 y ago

featured-image

ఈ రోజుల్లో మోకాళ్ళు, కీళ్ల నొప్పులు అనేక మందికి సమస్యగా మారాయి. ఒకప్పుడు వయసు పెరిగేకొద్దీ ఈ నొప్పులు రావటం సాధారణం అయితే, ఆధునిక జీవనశైలి కారణంగా చిన్న వయసువారిలో కూడా ఈ కీళ్ల నొప్పులు చూస్తున్నాం. కీళ్ల నొప్పులతో బాధపడేవారు కూర్చోడానికి కష్టపడితే, లేచేసరికి మరింత ఇబ్బంది పడతారు. వర్షాకాలంలో ఈ నొప్పులు మరింత ఎక్కువవుతాయి, చల్లని వాతావరణం కీళ్లపై ఒత్తిడిని పెంచుతుంది. ఈకాలంలో తేమ, వాతావరణ పీడనం, ఉష్ణోగ్రత మార్పులతో చాలా మందికి కీళ్ల నొప్పులు కలుగుతాయి, అంతేకాకుండా కండరాలు గట్టిపడటం వల్ల కూడా నొప్పి పెరిగే అవకాశం ఉంది. ఈ రోజుల్లో చెడు ఆహార అలవాట్ల వల్ల ఈ ఎక్కువ‌గా ఉంటుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల కూడా నొప్పులు వస్తాయి, ఇది స్ఫటికాలుగా మారి కీళ్ల చుట్టూ పేరుకుపోతుంది. బలహీనత, జన్యుపరమైన కారణాలు, వయసు పెరుగుదల కూడా కీళ్ల నొప్పుల్ని కలిగిస్తాయి. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందేందుకు మన జీవనశైలిలో మార్పులు చేసుకోవ‌డం అలాగే డైట్‌లో కొన్ని ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు తీసుకోవాలి.

 


వెల్లుల్లి  

శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగితే కీళ్ల నొప్పులు రావడం సాధ్యమే. ఈ యాసిడ్‌ను తగ్గించడంలో వెల్లుల్లి ఎంతో సహాయపడుతుంది. కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు ఉదయం ఖాళీ కడుపుతో 3-4 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవటం మంచిది. అంత ఘాటుగా అనిపించినా, ఉప్పు, ఇంగువ, జీలకర్ర చేర్చుకుంటే రుచికరంగా మారుతుంది. 

వ్యాయామం

ప్రతి రోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. స్థిరమైన వ్యాయామం కీళ్ల నొప్పులు తగ్గించటానికి ఎంతో ఉపకరిస్తుంది. మీకు అనువైన వ్యాయామాలు తెలుసుకోవడానికి ఫిజియోథెరపిస్టును సంప్రదించండి. 

అల్లం

అల్లంలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న వారు అల్లం తీసుకుంటే కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. అలాగే, అల్లం నూనెతో కీళ్లపై మసాజ్ చేసుకుంటే నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.

 

వాము

వాములో పుష్కలంగా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. దీన్ని తరచుగా తీసుకుంటే యూరిక్ యాసిడ్ సమస్యను పరిష్కరించవచ్చు. వాము రాత్రంతా నీటిలో నానబెట్టి, మరుసటి రోజు ఆ నీటిని తాగడం ద్వారా కీళ్ల నొప్పుల్లో ఉపశమనం పొందవచ్చు. 

పసుపు

మన కిచెన్‌లో సాధారణంగా కనిపించే దినుసుల్లో పసుపు ముఖ్యమైనది. పసుపులో ఎన్నో ఔషద గుణాలు ఉంటాయి. అందులో కర్కుమిన్, నేచురల్‌ పెయిన్‌ కిల్లర్‌ మాదిరిగా పనిచేస్తుంది. కీళ్ల నొప్పి నుండి ఉపశమనం పొందాలంటే, ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో ఒక చెంచా పసుపు కలిపి చక్కగా తాగడం మంచిది. కీళ్ల వద్ద పసుపు నూనెతో మర్దనా చేస్తే నొప్పులు తగ్గుతాయి. ఈ పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఫంగీసైడల్‌ లక్షణాలు విరివిగా ఉంటాయి.

 

ఫైబర్‌ డైట్‌

మీ డైట్‌లో ఫైబర్ ఎక్కువ‌గా ఉన్న ఆహారం తీసుకుంటే, శరీరంలో యూరిక్‌ యాసిడ్‌ నియంత్రణ చేయబడుతుంది. బాడీలో యూరిక్‌ యాసిడ్‌ పెరిగితే కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల, ఓట్స్, బ్రౌన్ రైస్, ఓట్స్‌ మీల్ వంటి ఆహారాలను మీ డైట్‌లో చేర్చండి. ఫైబర్ ఎక్కువ‌గా ఉన్న ఆహారం తీసుకుంటే, మీ జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది మరియు బరువు నియంత్రణలో ఉంటుంది.


గమనిక: పైన అందించిన ఈ ఆరోగ్య సమాచారం మరియు సూచనలు మీ అవగాహన కొరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి సమస్య ఉన్నా, వైద్యులను సంప్రదించడం ఉత్తమం. 


కొలెస్ట్రాల్ తగ్గించి గుండెని కాపాడే అలవాట్లు

Related News

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD